మరణానంతర పెద్దకర్మలో కూడా ఒక స్వచ్ఛ కార్యకర్త ఆదర్శము.....           17-Aug-2026

 మరణానంతర పెద్దకర్మలో కూడా ఒక స్వచ్ఛ కార్యకర్త ఆదర్శము.

               చల్లపల్లి నుండి 15 మంది స్వచ్ఛ కార్యకర్తలం ఒకప్పటి మా సహ కార్యకర్తా, ఇటీవల కీర్తి శేషుడు అయిన శివరామకృష్ణయ్య గారి కుమార్తె గారి నిడమానూరు దగ్గర సంస్మరణ కార్యక్రమానికి వెళ్ళాము. ఆ కార్యక్రమం జరిగే ఆవరణ గాని భోజానాల ఏర్పాట్లు గాని ఒక స్వచ్ఛ కార్యకర్త పేరిట జరిగే చక్కని హరిత విందును తలపించింది.

1. అక్కడ ఫ్లెక్సీ కనిపించలేదు. గుడ్డ బ్యానరే ఉన్నది.

2. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు గాని, గ్లాసులు, స్పూన్లు, విస్తర్లు వంటివేవీ కనిపించలేదు.   

3. చల్లపల్లిలోనే కాక ఇలాంటి పర్యావరణహిత భోజన - భాజనములు విజయవాడ ప్రాంతంలో కూడా జరుగుట చూసి స్వచ్ఛ కార్యకర్తలమైన మేము ఎంతో సంతృప్తి చెందాము.

- స్వచ్ఛ కార్యకర్తల తరపున

    నల్లూరి రామారావు

   17.08.2026