06.09.2024....           06-Sep-2024

      అహం మీసం త్రిప్పుతుంటే

స్వార్ధములు తొడగొట్టుతుంటే – అహం మీసం త్రిప్పుతుంటే –

బిడియములు, సందిగ్ధతలు మరి కొంతమందిని అడ్డుకొంటే –

అడ్డు గోడలు దాటుకొంటూ బాధ్యతలు గుర్తుంచుకొంటూ

గ్రామ సేవకు దిగే వారలు కదా అభివందనార్హులు?